ప్రచురణ తేదీ : Dec 1, 2017 11:06 PM IST

వీడియో : మా ఊర్లో మద్యం షాప్ కంపల్సరీ..ఆడామగా కలసి రోడ్డెక్కారు..!

ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. ఏపీలోని ఒంగోలు జిల్లాకు చెందిన ఓ మారు మూల గ్రామంలో. సాధారణంగా మగాళ్లు మందుకొడుతుంటే మహిళలు వ్యతిరేకించాలి. తమ ఊర్లో మద్యం షాపు కానీ, బెల్టు షాపు కానీ లేకుండా చేయాలని మహిళలు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తమ ఊర్లో ఖచ్చితంగా మద్యం షాపు ఉండాల్సిందే అంటూ మహిళలు, మగవాళ్ళు కలసి ధర్నా చేశారు. మద్యం తాగితే మీ ఆరోగ్యాలు, కాపురాలు నాశనం కావా అని అడగగా వాళ్ళు ఇస్తున్న వింత సమాధానం ఇదే..

మా ఊర్లో మగాళ్లం దాదాపుగా అందరం మందు తాగుతాం. మా ఊర్లో మద్యం షాపు లేకుంటే బయటి ఊరికి వెళ్లాలంటే కనీసం 9 కిమీ ప్రయాణించాలి. ఎక్కడెక్కడికో వెళ్లి తాగి పడిపోయేకంటే మా ఊర్లోనే తాగి, తిని ఇక్కడే పడిపోతాం.. ఇది ఓ పురుషుడు ఇచ్చిన సమాధానం. మహిళలు కూడా ఇదే తరహా సమాధానం ఇచ్చారు. మా ఇంట్లో మగాళ్లు బయట ఊర్లకు వెళ్లి అక్కడే తాగి పడిపోతే తీసుకురాలేక చస్తున్నాం. అందుకే మా ఊర్లో మద్యం షాపు ఉండాల్సిందే. ఇక్కడే తాగుతారు..ఇక్కడే చస్తారు అంటూ ఓ మహిళలు సమాధానం ఇచ్చారు.

Comments