ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు : కేటీఆర్ స్ట్రాంగ్ స్పీచ్

ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న ప్రతిపక్ష పారి కాంగ్రెస్ పై టీఆరెస్ లీడర్లు కౌంటర్ల ను బాగానే ఇస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసిన అన్ని స్థానాలను దక్కించుకోవాలని ఇప్పటినుండే అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రజలను ఆకర్షించే విధంగా అన్ని రాజకీయా పార్టీలు ఎవరి స్థాయిలో వారు గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెస్ అయితే టీఆరెస్ కి గట్టి పోటీని ఇవ్వాలని చూస్తోంది. కానీ ఆపార్టీలో నాయకుల మధ్య విభేదాలు రావడం పార్టీ అధిష్ఠానాన్ని కలవరపెడుతుందనే చెప్పాలి. టీఆరెస్ అయితే ఎక్కడ ఛాన్స్ దొరికినా ప్రతిపక్ష కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. రీసెంట్ గా తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు కాంగ్రెస్ పై మాటల తూటాలు పేల్చారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన రైతు సమన్వయ సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ” యాభై ఏండ్ల పాలనలో కాంగ్రెసోళ్లు రైతులను అరిగోస పాలు జేసిండ్రు.. అర్ధరాత్రి కరెంటిచ్చి కంటిమీద కునుకు లేకుండా చేసిండ్రు.. ఇక ఎరువులు విత్తనాల కోసం లైన్లు పట్టి మస్తు మంది ప్రాణాలు ఇడిసిండ్రు.. ఇగో గిప్పుడు సీఎం కేసీఆర్‌ రైతును రాజును చేస్తామంటే మళ్లీ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నరు.. కోర్టులకు వెళ్లి అడ్డుకోవాలని చూస్తుండ్రు.’ అంటూ కేటీఆర్ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ప్రతి మంచి పనిలో వారు అడ్డొస్తున్నారు అనే విధంగా కేసీఆర్ స్పీచ్ ఇచ్చారు.

Comments