ప్రచురణ తేదీ : Tue, Aug 8th, 2017

అరుదైన గౌరవం.. ట్రంప్ కూతురు పక్కన కేటీఆర్..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించే అవకాశం కేటీఆర్ కు దక్కింది. సెప్టెంబర్ 12 న అమెరికాలోని వాషింగ్టన్ లో జరగబోయే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఈమేరకు యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ కేటీఆర్ ని ఆహ్వానించింది.

ఈ సదస్సులో అమెరికా, ఇండియా కు చెందిన ప్రముఖులు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా పాల్గొననున్నారు. అమెరికా ప్రభుత్వ కార్యదర్శి టిల్లర్ సన్ మరియు ఇతర ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు. మంచి వాక్ చాతుర్యం కలిగిన కేటీఆర్ అభిప్రాయాలను ఈ సదస్సు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి కేటీఆర్ ఈ సదస్సుకు హాజరవుతారని తాము భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments