ప్రచురణ తేదీ : Wed, Aug 9th, 2017

కేటీఆర్ నోట అలాంటి మాటా..రాజకీయాల్లో ఉన్నందుకు భాదపడుతున్నారట..!

తెలంగాణ ఐటి మరియు మున్సిపల్ శాఖా మంత్రి నేడు మీడియాతో ఇష్టాగోష్టి లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను వెల్లండించారు. 2019 లో టిఆర్ ఎస్ పార్టీ తిరిగి సంపూర్ణ మెజారిటీ తో అధికారం లోకి రావడం ఖాయమని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని అన్నారు. దీనిని బట్టే తమ బలం ఏంటో అర్థం అవుతుందని అన్నారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అనవసర విమర్శలను కట్టిపెట్టాలని సూచించారు.

తన కొడుకు హిమాన్షుని కూడా వదలకుండా విమర్శలు చేస్తుండడం తనకు భాద కలిగిస్తోందని కేటీఆర్ అన్నారు.ఈ విషయంలో రాజకీయాల్లో ఉన్నందుకు బాధ పడుతున్నానని కేటీఆర్ అన్నారు. తనని పార్టీని విమర్శిస్తే బదులిస్తామని, కానీ చిన్న పిల్లలని విమర్శిస్తే ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని అన్నారు. ఇటీవల కేటీఆర్ కుమారుడు హిమాన్షు కొందరి పై దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలని కేటీఆర్ ఖండించారు కూడా.

Comments