ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

జగన్ పై రెచ్చిపోయిన లేడి ఎంపీ..?

కొంత కాలంగా వైసిపికి దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎంపీ కొత్తపల్లి గీత జగన్ పై ఘాటు విమర్శలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వైసిపి తరుపున అరకు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన కొత్త కొత్తపల్లి గీత ఆ తరువాత సొంతపార్టీలో విభేదాలతో వైసిపికి దూరం అయ్యారు. గీత టీడీపీలో చేరబోతున్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ తాను ఏ పార్టీలోనూ చేరడం లేదంటూ ఆమె తేల్చి చెప్పారు.

తాజాగా ఆమె జగన్ పాదయాత్ర గురించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలందరితో నిన్న సమావేశమైన జగన్.. పాదయాత్ర సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలని దిశానిర్దేశం చేశారు. నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతారని అనుకోవడం భ్రమే అని ఆమె అన్నారు. పాదయాత్ర కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అని ఆమె అన్నారు. స్పెషల్ స్టేటస్ రాదనే విషయం నేతలందరికీ తెలుసనీ కానీ దానిని కూడా రాజాకీయ లభ్ది కొరకే ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక హోదా పై జగన్ చెప్పిన రాజీనామాల పోరాటం నాటకమని గీత కొట్టిపారేశారు.

Comments