రోజా లీడరే కాదంటున్న సీనియర్ నటుడు !

సీనియర్ నటులు కోటశ్రీనివాస్ రావు వైసిపి ఎమ్మెల్యే రోజా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమకాలిని అంశాలపై కోటా పెద్దగా మాట్లాడారు. ఒకవేళ మాట్లాడితే ముక్కు సూటిగా మాట్లాడేస్తారు. తెలుగులో పరభాషా నటులు రావడంపై ఆయన ఎప్పటినుంచో వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో రోజాని తాను పొలిటికల్ లీడర్ గా పరిగణించనని అన్నారు. అందుకు కారణం ఆమె మాట్లాడే పద్దతే అని అన్నారు.

ఇటీవల ఓ టీవీ చానల్ లో బండ్ల గణేష్, రోజా మధ్య జరిగిన తిట్ల పురాణం గురించి కోటా ప్రస్తావించారు. ఏమిటా మాటలు.. ఏమన్నా అర్థం ఉందా అంటూ ప్రశ్నించారు. పోనీ బండ్ల గణేష్ అంటే కుర్ర వెధవ..రోజాకు ఏమైంది. అనుభవం ఉన్న రాజకీయ నేతగా, ఎమ్మెల్యే గా లాగేనా మాట్లాడేది అంటూ కోటా మండి పడ్డారు. తాను రోజా గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు. బయట జరుగుతున్న దాని గురించే మాట్లాడుతున్నా అని అన్నారు.

Comments