ప్రచురణ తేదీ : Fri, Aug 11th, 2017

85 ఏళ్ల తర్వాత కోహ్లీ సేన ఆ ఘనతను అందుకుంటుందా ..

మినీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోపి ఫైనల్ ఓటమి తర్వాత భారత జట్టు పుంజుకొని వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో వరుసగా రెండు టెస్టులను గెలిచి క్రికెట్ దిగ్గజాల మన్ననలను అందుకుంది. ముఖ్యంగా విరాట్ కెప్టెన్సీ పై విమర్శకులు ప్రశంసలను కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు వరుసగా మూడవ టెస్టును కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చెయ్యాలని భావిస్తూంది కోహ్లీ సేన. అంతే కాకుండా 88 ఏళ్ల చరిత్రను తిరగరాసేందుకు కృషి చేస్తోంది.

ఇప్పటికే శ్రీలంకను రెండు టెస్టుల్లో కంగు తినిపించిన భారత జట్టు మూడవ టెస్టులో కూడా గెలిస్తే.. విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ ను క్లిన్ స్వీప్ చేసిన జట్టుగా ప్రస్తుత భరత జట్టు రికార్డును నమోదు చేసుకుంటుంది. గత 85 ఏళ్లుగా విదేశాల్లో భారత జట్టు టెస్ట్ సిరీస్ ను క్లిన్ స్వీప్ ఎన్నడూ చేయలేదు. దీంతో ఇప్పుడు శ్రీలంకను ఓడించి ఆ ఘనతను కోహ్లీ సేన వారి ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. గెలిచిన రెండు మ్యాచ్ లలో భారత జట్టే పై చేయి సాధించింది. శ్రీలంక జట్టు ఎందులోనూ పోటీని ఇవ్వలేకపోయింది. మరి మూడవ టెస్టులో అయినా లంకేయులు ఏ స్థాయిలో పోరాడతారో చూడాలి.

Comments