ప్రచురణ తేదీ : Dec 4, 2017 9:59 AM IST

వైరల్ వీడియో: కోపంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కోహ్లీ

ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఢిల్లీలో లో గత కొంత కాలంగా వాతావరణం ఏ మాత్రం బావుండడం లేదు. కొన్ని స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇకపోతే టెస్ట్ మ్యాచ్ లో కూడా వాతావరణ ప్రభావం చాలానే కనపడింది. గాలిలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో శ్రీలంక ఆటగాళ్లు ఫీల్డింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి.

ముందుగా లక్మల్ – గమగే బౌలింగ్ వేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఆయాసం రావడంతో వారు వెంటనే ఫీల్డ్ నుంచి తప్పుకున్నారు. అనంతరం అంపైర్లకు శ్రీలంక ఆటగాళ్లు ఈ వాతావరణంలో ఫీల్డింగ్ చేయలేమని చెప్పడంతో రెండు సార్లు ఆటకు అంతరాయం కలిగింది. దీంతో కోహ్లీ ఎవరు ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే కోపంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. తాము ఫీల్డింగ్ చేస్తామని కోపంతో సైగలు చేసిన కోహ్లీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Comments