ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

ఓపిక నశిస్తే తెలంగాణ ప్రజలు తమ తడాఖా చూపిస్తారంటున్న కోదండరాం

kodandaram
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణాలో ఉన్న రాజకీయ పార్టీలను, కార్యకర్తలను ఒక్క తాటిపై నడిపించిన ఘనత టీ జేఏసీ చైర్మన్ కోదండరాంకి దక్కింది. ఆయన తెలంగాణ రాష్ట్రము వచ్చాక కొన్నాళ్ళు మౌనంగానే ఉన్నారు. అయితే ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులు ఆయనకు నచ్చక బహిరంగంగానే కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ పుకార్లపై స్పందించిన కోదండరాం ఇదంతా పాలకుల వ్యూహాత్మక దాడి అని, ప్రజలను గందరగోళంలోకి నెట్టడానికి, నాయకుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి పదవిలో ఎవరు కూర్చున్న జేఏసీ ప్రజల పక్షాన నిలబడుతుందని, తాను కులం పేరుతొ తాను ఎప్పుడు లబ్ది పొందలేదని ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు. అయినా తాను పార్టీ పెడుతున్నానంటే తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారమా అడిగితే వెటకారంగా మాట్లాడడం పాలక వర్గాలకు అలవాటేనని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతొ విధ్వంసం జరుగుతుందని, ఉమ్మడి రాష్ట్రానికంటే అణచివేత కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ఓపిక ఎక్కువ అని, ఆ ఓపిక నశిస్తే మాత్రం తమ తడాఖా చూపిస్తారని కోదండరాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Comments