ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

పీసీసీ చీఫ్ గా మాజీ ముఖ్యమంత్రి? కొత్తగా ఇదేం ట్విస్ట్?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పొలిటికల్ బ్రేక్ తీసుకున్నారు. తెలంగాణ విభజన నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకోవడంతో తన సీఎం పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి దూరం అయిన విషయం తెలిసిందే. విభజన ఎఫెక్ట్ తో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో దయనీయంగా తయారైంది. రాష్ట్ర విభజన చేసిందన్న కోపంతో గత ఎన్నికల్లో ఆ పార్టీ కి ప్రజలు ఒక సీటు కూడా కట్ట బెట్టలేదు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ పై ఏపీ ప్రజల్లో కోపం లేదు. అయినా కూడా ఆ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు. నాయకత్వ లోపమే దీనికి స్పష్టమైన కారణం. ప్రస్తుతం కాంగ్రెస్ ఏపీలో సరైన నాయకత్వ బలం లేదు. కేవలం రఘువీరా రెడ్డి ఒక్కరే పార్టీని ఒంటెద్దు బండిలా లాక్కొస్తున్నారు.

సమస్యని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం దానికి పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ వినిపిస్తున్నా షాకింగ్ రూమర్ ఏంటంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కిరణ్ కుమార్ రెడ్డి గురించి వాకబు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటె ఆ దిశగా ప్రయత్నాలు చేయాలనీ పార్టీ నేతల్ని సోనియా ఆదేశించారట. కిరణ్ కుమార్ రెడ్డి సమర్థత గురించి తెలిసిన సోనియా అతడికి ఏపీ పిసిసి చీఫ్ పదవి ఇవ్వడానికి కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఇంతకీ నల్లారి తిరిగి సొంత గూటికి చేరేందుకు ఆసక్తిగా ఉన్నారా లేదా అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. కాగా కిరణ్ కుమార్ రెడ్డి కి వివిధ పార్టీల నుంచి ఆఫర్ లు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఇతర పార్టీ లోకి వెళ్లి అక్కడ ఇమడడానికి ఇబ్బంది పడేకంటే సొంత పార్టీ లోకి రీఎంట్రీ ఇచ్చి రాజాలా ఉండడం మంచిదనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.

Comments