చంద్రబాబును ఆహ్వానించబోతోన్న కేసీఆర్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు – కె.చంద్ర శేఖర్ రావ్ ఇప్పుడు రాజకీయాల పరంగా విమర్శలు చేసుకుంటున్నా.. ఒకప్పుడు వీరు ఎంతో సన్నిహితంగా కలిసి తిరిగిన వారే. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల వలన వారి మధ్య దూరం కూడా చాలా పెరిగిపోయింది. అప్పుడపుడు కొన్ని కార్యక్రమాల్లో కలుసుకుంటున్నా కూడా ఎదో అలా మాట్లాడుకొని వెళ్లిపోతున్నారు. వీరు ఎదురుపడి చాలా కాలమే అవుతోంది.

ఇక ఫైనల్ గా మరోసారి చంద్రబాబు – కేసీఆర్ ఎదురుపడబోతున్నారు. ఈ నెల డిసెంబర్ 15న హైదరాబాద్ లో తెలుగు మహా సభలు ప్రారంభంకానున్నాయి. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఈ సందర్భంగా నిన్న అధికారులతో జరిపిన సమావేశంలో కేసిఆర్ ఈ విషయం గురించి చర్చలు జరిపారు. తెలుగు బాషా కోసం పాటుపడుతున్న సాహితివేత్తలందరి సమక్షంలో సభను నిర్వహించాలని తెలిపారు. ఇక సభకు ముఖమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానిద్దామని చెబుతూ.. ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు హాజరుకానున్నారని కేసీఆర్ తెలిపారు.

Comments