ప్రచురణ తేదీ : Fri, Apr 21st, 2017

హరీష్ రావు కి ఆ పార్టీలో విలువ లేదు. అందుకే కాంగ్రెస్ కు రప్పిస్తా: కేసీఆర్ మేనల్లుడు


కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదుగుతూ తన రాజకీయ కోణాన్ని చూపిస్తున్న రాజకీయ నేత ఉమేష్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు అయినా ఉమేష్ తన స్థాన్నాన్ని కాంగ్రెస్ లో సుస్థిరం చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఆయన కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం మీడియా తో మాట్లాడిన ఉమేష్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ముసలం పుట్టిందని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ పార్టీలో అంతర్గత యుద్దాలు నెలకొంటున్నాయని చెబుతూ.. మంత్రి హరీష్ రావు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ని ఆ పార్టీలో మారియాద పూర్వకంగా చూడటం లేదని,హరీష్ రావు అవమానాలు భరిస్తూ కేసీఆర్ పాలనలో కొనసాగాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే హరీష్ రావు ఒక మంచి నాయకుడని పొగిడారు. అంతే కాకుండా అతనిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందని చెబుతూ ఆయనను కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని ఉమేష్ రావు తెలిపారు.

Comments