కేసీఆర్ ప్లాన్ టెరిఫిక్.. స్పీడ్ మైండ్ బ్లోయింగ్..!

దేశంలో అంత్యంత ప్రభావవంతం అయిన రాజకీయ నేతల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉంటారు. ఆయన మాటల్లో చురుకుదనం చేతల్లో కనిపిస్తుంది. పట్టిన పంతం నెగ్గించుకోవడంలో కేసీఆర్ ని మించిన వారు లేరు. కాగా తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ ఎన్నికల ప్రణాళికలో కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణాని స్వీప్ చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్లానింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రతిపక్షాన్ని ఈ సారి కోలుకొని విధంగా చావు దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారట. ఎన్నికలకు 8 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ నయా ప్లాన్ వెనుక ఉన్న మర్మం ఏంటని తెలంగాణ రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి. కాగా గత మూడేళ్లలో పార్టీ తరుపున నిర్వహించిన అంతర్గత సర్వే ప్రకారం టిఆర్ ఎస్ అధిష్టానం 2019 ఎన్నికల అభ్యర్థుల విషయంలో ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ రూపొందించిన జాబితా ప్రకారం కొందరు మంచి పనితీరు కనబర్చని ఎమ్మెల్యే లు టికెట్టు కోల్పోనునట్లు తెలుస్తోంది. వారిస్థానంలో పార్టీలో యాక్టివ్ గాపనిచేసిన లీడర్ లకు టికెట్ కేటాయిస్తారట.

తెలంగాణలోని 70 నియోజకవర్గాల్లో ఇద్దరేసి అభ్యర్థుల్ని ఆప్షన్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 28 స్థానాల్లో ఒక్కరేసి అభ్యర్థులు, 20 స్థానాల్లో ముగ్గురేసి అభ్యర్థుల్ని కూడా ఎంపిక చేశారట. తుది జాబితాని వీరినుంచే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు 8 నెలల ముందే తుది జాబితా సిద్ధం చేయాలనేది కేసీఆర్ ప్లాన్. కేసీఆర్ ప్లానే అదిరిపోయిందనుకుంటే వేగం మైండ్ బ్లోయింగ్ అని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

Comments