ప్రచురణ తేదీ : Sat, Oct 7th, 2017

చావులకు కారణం ఆమె.. సోనియా గాంధీ పై కేసీఆర్ ఫైర్

ప్రస్తుతం తెలంగాణాలో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు మళ్లీ మొదలవ్వనున్నట్లు నిన్న కేసీఆర్ స్పీచ్ ని చూస్తే అర్దమైపోతోంది. ఎప్పటిలానే కేసీఆర్ తన మాటలతో ప్రతి పక్షాల పై వేసిన కౌంటర్లు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా టీఆరెస్ పై కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఇంకా తెలంగాణను అన్ని రాకలుగా ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్‌ లాల్‌ నెహ్రూ. అడిగితే కాల్చి చంపింది ఇందిరా గాంధీ. 14 ఏళ్లు ఆలస్యం చేసి ఎంతో మంది చావులకు సోనియా గాంధీ కారణమైందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకోసం కాంగ్రెస్ ఏనాడూ పని చేయలేదు. మొత్తం తెలంగాణను కాంగ్రెస్ సర్వ నాశనం చేసింది. అది నిజం కాదా? ఆనాటి నుంచి ఈనాటి వరకూ శాపం తెలంగాణకు ఒక శనిలా పట్టిందని కేసీఆర్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.

Comments