ప్రచురణ తేదీ : Sun, Sep 25th, 2016

పట్టిస్తే 10 వేలు అంటున్న కేసీఆర్ !

kcr
భారీ వర్షాలతో సతమవుతూ, ఇళ్ళు కోల్పోయి, తిండి లేక ఇబ్బందిపడుతున్న హైదరాబాద్ వాసులకు తమకు ఈ పరిస్థితి కలగడానికి తమ వంతు తప్పు చేసిన ఆక్రమణదారులపై పగ తీర్చుకుని, బోనస్ గా బహుమానము కూడా పొందే అవకాశమిచ్చాడు కేసీఆర్. అదేమంటే కురిసిన భారీ వర్షపు నీరు కాల్వల ద్వారా, డ్రైనేజీల ద్వారా బయటకి పోయే వీలు లేకుండా వాటిపై అక్రమంగా కట్టడాలు కట్టిన వారి పూర్తి వివరాలను తమకు తెలియజేయాలని, అలా చేసిన వారికి 10 వేలు బహుమానం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.

అలాగే ఇప్పటి వరకూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయివేట్, ప్రభుత్వ కట్టడాలైన కలిపి 28,000 భవనాల వరకూ గుర్తించామని, వాటిని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తామని తెలిపారు. నగర జీవనానికి, అభివృద్ధికి అడ్డుపడే ఎవరినైనా సహించేది లేదని, కథన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఇక వర్ష బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని కూడా తెలిపారు.

Comments