ప్రచురణ తేదీ : Dec 28, 2016 6:53 PM IST

కేసీఆర్ 100 ఎకరాలు పోగొట్టుకున్నారా..?

kcr1
కేసీఆర్ నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ విషయం లో అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య భూ వివాదం నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు కు సంబంధించి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్లేందుకు భూసేకరణ చట్టం లో తెలంగాణా ప్రభుత్వం సవరణలను చేయాలని భావించింది. కాగా నేడు తెలంగాణా అసెంబ్లీ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యంమత్రి కేసీఆర్ అసెంబ్లీ లో మాట్లాడారు. భూమిని పోగొట్టుకుంటే ఆ భాద ఎలా ఉంటుందో తనకు తెలుసు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టులను కట్టే సమయంలో అలా జరగడం సహజమని ఆయన అన్నారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ విషయం లో అనవసర రాద్ధాంతం వద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ముదిగొండ లో లాగే మల్లన్న సాగర్ లో కూడా చేయాలని సిపిఎం ప్రయత్నించిందని కేసీఆర్ అన్నారు. సిపిఎం కుట్రలు చేసి పోలీస్ లు కాల్పులు జరిగేదాకా తీసుకుని వెళ్లారని అన్నారు. కాగా భూమిని కోల్పోతే ఉండే భాద ఏమిటో తనకు తెలుసు అని కేసీఆర్ అన్నారు. అప్పర్ మానేరు ప్రాజెక్ట్ విషయం లో తాను 100 ఎకరాల భూమిని కోల్పోయానని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో ఏ ప్రాజెక్ట్ కూ ఇవ్వని నష్ట పరిహారం తాము ఇస్తున్నామని కేసీఆర్ అన్నారు. భూనిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టుకునేందుకు రూ 5.4 లక్షలు ఇస్తున్నామని కేసీఆర్ అన్నారు. 2017 డిసెంబర్ నాటికి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ని పూర్తీ చేయడమే తమ లక్ష్యమని కేసీఆర్ అన్నారు.

Comments