కథువ ఘటన : బయటపడ్డ షాకింగ్ నిజాలు

కథువా బాలిక హత్యాచార ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి చాలా రకాలుగా ఘటనపై అనుమానాలు చెలరేగుతూనే ఉన్నాయి. నిందితులను వదలకూడదని వారికి శిక్ష పడాలని దేశమంతా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే రీసెంట్ గా ఘటన గురించి మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన ఆధారాల ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడే ఆవకాశం ఉంది. ఢిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌(డీఎఫ్‌ఎల్‌) నివేదికలో కొన్ని ఆధారాలు బయటపడ్డాయి.

చిన్నారి శరీర భాగాలు అలాగే దుస్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షించగా నిందితుల డీఎన్‌ఏతో సరితూగాయని డీఎఫ్‌ఎల్‌ నివేదికలో వెల్లడైంది. ఈ విషయాన్ని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) తెలిపింది. ఇక ఘటన జరిగింది కూడా ఆలయంలోనే అని తేలింది. మొదట సోషల్ మీడియాలో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక హత్య జరిగిన తరువాత ఆధారాలు బయటపడకుండా బాలిక శరీరాన్ని మొత్తం తుడిచేశారు. దుస్తులను కూడా ఉతికేశారు. అందువల్ల ఆధారాలు దొరకడం చాలా కష్టమయ్యింది. అయితే ఘటన స్థలంలో లభించిన రక్తనమూనాలు, వెంటుక్రలు ఎవరివనేవి తేల్చడానికి సమయం చాలానే పట్టింది. డీఎఫ్‌ఎల్‌ చొరవతో మృతురాలి శరీర గాయాలను, ఒంటిపై లభించిన రక్తపు నమూనాలను అలాగే వెంట్రుకలను పరీక్షించగా నిందితుల డీఎన్‌ఏతో సెట్ అయ్యింది. దీంతో నిందితులు వారేనని నిర్దారణ అయ్యిందని సిట్ అధికారులు తెలిపారు.

Comments