ప్రచురణ తేదీ : Dec 29, 2016 4:39 PM IST

మోడీ కోసం కొత్త పథకాన్ని ప్రారంభించిన కూరగాయలమ్మే మహిళ..!

women
దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. కర్ణాటకకు చెందిన శరణమ్మ (45) అనే మహిళకు కూడా మోడీ అంటే ఎనలేని అభిమానం. ఇలాంటి అభిమానులు మాత్రం అరుదుగా ఉంటారు.ప్రధాని మోడీ చేపడుతున్న పథకాలు ఆమెని ఎంతగానో ఆకర్షించాయి.ముఖ్యంగా మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ పథకం ఆమెకు ఎంతగానో నచ్చింది. ప్రతి ఒక్కరి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలన్న మోడీ కోరిక నెరవేరాలని ఆమె కోరుతోంది. కోరుకోవడమే కాదు.. తనవంతుగా కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఆమెది కర్ణాటక లోని దానాపూర్ గ్రామం. 1300 కుటుంబాలు ఉంటున్న ఆగ్రామం లో 500 కుటుంబాలకు మరుగుదొడ్డి లేదని ఆమె చాలా బాధపడుతోంది. అదేఊరిలో ఆమె కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది.

తన గ్రామం లో ఉన్న వారందరూ మరుగు దొడ్డి కట్టుకునేలా ఆమె గ్రామస్తులను ప్రోత్సాహిస్తోంది.తన గ్రామం లో మరుగుదొడ్డి కట్టుకోవడానికి అంగీకరించిన వారికి ఆమె కిలో టమోటా లను బహుమతిగా ఇస్తుండడం విశేషం. మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఊరంతా ప్రచారం చేస్తోంది. దానికి అంగీకరించిన వారికి ఒక కిలో టమోటాలను బహుమతిగా ఇస్తోంది. ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడం వల్ల ఇల్లు వాకిలి పరిశుభ్రంగా ఉంటాయని మోడీ కలలు కంటున్న స్వచ్ఛభారత్ సాకారమవుతుందని శరణమ్మ తన గ్రామా ప్రజలకు వివరించడం విశేషం.

Comments