కాకినాడ వైసిపి కీలకనేత జనసేన లోకి?

2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆశావహులందరు ఒక్కొరొక్కరుగా తాము టికెట్ ఆశిస్తున్న పార్టీల్లోకి మెల్లగా దూకుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఇటువంటి పరిస్థితే నెలకొనివుంది. ప్రస్తుతం ఏపీలో ఈ జంపింగ్ లురోజురోజుకి మరింత ఊపందుకుంటున్నాయి. ఇక విషయం ఏమిటంటే, కాకినాడలో మంచి ప్రజానేతగా పేరున్న ముత్తా గోపాల కృష్ణ, మరియు ఆయన తనయుడు శశిధర్ లు ఇద్దరూ వైసిపికి రాజీనామా చేసి నేడు జనసేనలో చేరుతున్నట్లు ప్రక్కన విడుదల చేశారు. ఒకప్పుడు టీడీపీలో మంత్రిగా పనిచేసి, ఆతరువాత కాంగ్రెస్ తరపున ఎమ్యెల్యే గా ఎన్నికైనా ముత్తా, తదనంతరం గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరగా, ఆ పార్టీ నుండి టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి వైసిపి తీర్ధంపుచ్చుకున్నారు. అయితే అయన వైసిపిలో చేరడంతో జగన్ అక్కడి తన అనుచరుడైన చంద్రశేఖర్ రెడ్డిని కాదని, ముత్త శశిధర్ కు వైసిపి కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ పదవి కట్టబెట్టారు. అయితే కొన్నాళ్ల క్రితం శశిధర్ ను ఆ పదవినుండి తప్పించి తమ సామజిక వర్గానికి చెందిన ద్వారంపూడికి ఆ పదవి ఇవ్వడంతో, ముత్తా సహా ఆయన వర్గీయులందరూ కూడా అలిగారు.

ఇక ప్రస్తుతం అయన జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన చేసారు. వాస్తవానికి మొన్న తాను ఒక పనిమీద హైదరాబాద్ వెళ్లి అక్కడ ఒక సారి మర్యాదపూర్వకంగా జనసేన అధినేత పవన్ ను కలిశానని, అయన ఆదరణ చాలా నచ్చిందని, అంతేకాక మీ వంటి అనుభవజ్ఞుని సేవలు జనసేనకు చాలా అవసరమని, అంతటితో ఆగకుండా రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ కమిటీలో తనకు ప్రధాన పదవి కట్టబెదాతాను అని పవన్ అనడంతో, తాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని ముత్తా గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక ఆ సమయంలోనే తాను జనసేనలో చేరాలని నిశ్చయించినట్లు తెలిపారు. గతంలో తాను ఎన్టీఆర్, వైఎస్సాఆర్ వంటి గొప్ప నేతలతో పనిచేశానని, వారితో పనిచేసిన ఆ అనుభవాన్ని జనసేన ఎదుగుదలకు వాడుతాను అని ముత్తా అంటున్నారు. ఇక తన చేరిక లాంఛనమవడంతో అతి త్వరలోనే పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొని జనసేనను ఎలాగైనా అధికారంలోకి తెస్తామని ముత్తా స్పష్టం చేసారు…..

Comments