ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

పవన్ కళ్యాణ్ లేకపోతే ఖైదీ విడుదల అయ్యేది కాదు !

pawan-janasena-new
ఖైదీ నూట యాభై సినిమాకి సరిగ్గా ఒకే ఒక్క రోజు మిగిలి ఉంది . రేపు ఈ పాటికి నేటి ఏపీ లో రివ్యూ లూ కోలాహలం థియేటర్ ల దగ్గర సందడి అంతా చూడబోతున్నారు మీరు. అయితే ఖైదీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సంబంధించి ఒక వింత వాదన మనం వింటూనే ఉన్నాం. ఈ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ రాకపోవడం పట్ల మెగా ఫాన్స్ చాలా సీరియస్ అయ్యారు. లైఫ్ ఇచ్చిన చిరంజీవి కం బ్యాక్ ఫంక్షన్ పెడితే పవన్ రాపోవడం ఏంటి అంటూ గోల చేసారు అందరూ. ఈ ప్రోగ్రాం కి సంబంధించి డిస్కషన్ లు నడుస్తున్న వేళ పవన్ ఖైదీ సినిమా విడుదల కి చాలా హెల్ప్ చేసాడు అని కొత్త వ్యవహారం తెరమీదకి వచ్చింది. ఖైదీ నంబర్ 150కి రామ్ చరణ్ ప్రొడ్యూసర్. తొలిసారిగా నిర్మాణం వహిస్తుండడంతో.. మూవీని పర్ఫెక్ట్ గా తెరకెక్కించడంపై బాగానే దృష్టి పెట్టాడు.. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు కూడా. కానీ రిలీజ్ దగ్గరకి వచ్చేసరికి బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయ్. ఇక్కడ అనుభవమే అన్నిటికంటే ప్రధానంగా పని చేస్తుంది. చరణ్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న సమయంలో అప్పుడు రంగంలోకి దిగారు అల్లు అరవింద్ అండ్ పవన్ అసోసియేట్ శరత్ మరార్. మెగాస్టార్ మూవీ అన్నాక అరవింద్ హ్యాండ్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ రిలీజ్ కోసం థియేటర్స్.. డిస్ట్రిబ్యూషన్ విషయంలో చరణ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలియగానే.. తన నిర్మాత శరత్ మరార్ ని పంపి.. అన్ని పనులు సక్రమంగా పూర్తయ్యేలా చేశాడట పవన్. చివరి వరకూ చరణ్ కు తోడుగా ఉండి అన్ని పలు చక్కబెట్టాడట ఈ ప్రొడ్యూసర్. చివరకు పవన్ కు బదులుగా ఖైదీ ఫంక్షన్ కు వచ్చినది కూడా ఈయనే. అలా ఈ ఇద్దరూ కలిసి ఖైదీ నంబర్ 150 గ్రాండ్ రిలీజ్ విషయంలో తమ అనుభవాన్నంతా జోడించి చరణ్ కు హెల్ప్ చేసినట్లు తెలుస్తోంది.

Comments