ప్రచురణ తేదీ : Nov 20, 2016 1:04 PM IST

పవన్ ముందు పంచాయతీ..ప్రభుత్వం పై జర్నలిస్టుల ఫిర్యాదు..!

pawan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. వరుస బహిరంగ సభలు, ప్రజా సమస్యల పై ప్రజలతో మమేకం అవుతూ దూసుకుపోతున్నారు.కాగా పవన్ అన్న వర్గాల ప్రజల సమస్యలపై స్పందిస్తునానరు. రాజధాని భూముల వ్యవహారం మొదలుకుని మొన్న అనంతపురంలోని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో మమేకం అవడం వరకు అన్నివర్గాల ప్రజలను ఆకర్షిస్తున్నారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన జర్నలిస్టులు పవన్ ను కలసినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా పవన్ వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టుల పై ఏపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని వారు పవన్ కు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తమ హెల్త్ స్కీమ్ లని ఆలస్యం చేస్తోందని జర్నలిస్టులు పవన్ తో చెప్పుకున్నాన్రు. తమకు ఇచ్చిన హెల్త్ కార్డులు మెడికల్ బిల్ లను రీయింబర్స్ మెంట్ చేసుకునేలా లేవని వారు పవన్ తో అన్నారు. దీనిపై ప్రభుత్వం ఏమంటోందని జర్నలిస్టులని అడిగారు.ప్రభుత్వం వాయిదా వేస్తోందని అడిగితె అయిపోయిందని చెబుతున్నారని జర్నలిస్టులు పవన్ ముందు వాపోయారు.

Comments