ప్రచురణ తేదీ : Dec 5, 2017 11:27 AM IST

జయలలితకు కూతురు ఉంది.. ఇది నిజం!

తమిళ రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు తన అధికారంతో చక్రం తిప్పిన జయలలిత చనిపోయి ఏడాది గడుస్తున్నా ఇంకా ఆమె గురించి ఎదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. ముఖ్యంగా ఆమెకు పిల్లలు ఉన్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జయలలిత అసలు పెళ్లి చేసుకోలేదన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఆమె నటుడు శోభన్ బాబుతో రిలేషన్ ని మెయింటేన్ చేశారని ఆమె సన్నిహితులే ఆరోపిస్తుండం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఆమెకు ఒక కూతురు కూడా ఉందని గత కొంత కాలంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇకపోతే అమృతం అనే ఒక మహిళ కూడా తెరపైకి వచ్చి నేనే జయ అసలు కూతురునని చెప్పి కావాలంటే డిఎన్ఏ టెస్ట్ ని కూడా చేసుకోవాలని సవాల్ విసిరింది. అమృత అనే ఆ మహిళ జయ కూతురే అని జయ స్నేహితురాలు రీసెంట్ గా చెప్పింది. ఇక జయలలిత బంధువు మేనత్త లలిత కూడా ఆమెకు ఒక కూతురు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లలిత మాట్లాడుతూ.. జయలలిత తల్లి సంధ్య తండ్రికి విషమిచ్చి చంపేసింది. ఆ తరువాత సంధ్య సినిమాల్లోకి వెళ్లి జయకు కూడా అలవాటు చేసింది. దీంతో జయలలిత కొంచెం కొంచెంగా ఎదిగింది. కానీ ఆ తర్వాత జయ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పెద్దమ్మే సహాయం చేసింది. ఇక ఆమెకు ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత ఎవ్వరికి చెప్పవద్దని తమ నుంచి ఒట్టు వేయించుకుంది. కానీ ఆమె పేరు అమృత అని తమ వద్ద ఆధారాలు లేవని లలిత వివరించారు.

Comments