ప్రచురణ తేదీ : Fri, Aug 11th, 2017

రివ్యూ రాజా తీన్‌మార్ : జయ జానకి నాయక – యాక్షన్ ఎంటర్టైనర్ కి లవ్ టచ్

తెరపై కనిపించిన వారు : బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్, జగపతి బాబు

కెప్టెన్ ఆఫ్ ‘జయ జానకి నాయక’ : బోయపాటి శ్రీను

మూల కథ :

చక్రవర్తి గ్రూప్ అఫ్ కంపెనీస్ డైరెక్టర్ చక్రవర్తికి ఇద్దరు కొడుకులు గగన్(శ్రీనివాస్), నందు. తండ్రి కొడుకుల అనుబంధంతో వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అదే టైం లో గగన్ జీవితంలోకి జానకి(రకుల్ ప్రీత్ సింగ్) వస్తుంది. ఆమె వారి కుటుంబంలో వాతావరణం అంతా మార్చేస్తుంది. అదే సమయంలో గగన్ – జానకి ప్రేమించుకుంటారు. అయితే కొన్ని కారణాల వలన గగన్ – జానకి విడిపోవాల్సి వస్తుంది. ఆ తరువాత అనుకోకుండా జానకి చుట్టూ సమస్యలు చిక్కుకుంటుంది. జానకి కష్టానికి కారణం ఎవరు? అవి గగన్ కి ఎలా తెలిశాయి? జానకిని గగన్ సమస్యల నుంచి ఎలా బయటకి తీసుకొచ్చాడు? ఇక అశ్వద్ నారాయణ్ వర్మ(జగపతి బాబు), అరుణ్ పవార్(తరుణ్ అరోరా)తో గగన్ ని ఉన్న శత్రుత్వం ఏంటి?  అనేది ఈ సినిమా కథ

విజిల్ పోడు :

–> ఈ సినిమాలో దర్శకుడు బోయపాటి మార్క్ మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే అతని స్టైల్ ఎమోషన్స్ కూడా సినిమాలో భాగ వర్క్ అవుట్ అయ్యాయి కాబట్టి  ఫస్ట్ విజిల్ బోయపాటికి వేసుకోవచ్చు.

–> ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు చేయని విధంగా రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో చేసింది. అంతే అద్బుతంగా తన యాక్టింగ్ తో మెప్పించింది. అలాగే సినిమా కథ మొత్తం ఆమె పాత్ర బేస్ చేసుకొని తిరగడం దానికి ఆమె ఫుల్ గా న్యాయం చేసింది. కాబట్టి సెకండ్ విజిల్ ఆమె కోసం వేసుకోవచ్చు.

–>  ఇక హీరో  బెల్లంకొండ శ్రీనివాస్, అటు ఫైట్స్, ఇటు సాంగ్స్ లో తన టాలెంట్ ఏంటో మరో సారి చూపించుకున్నాడు. తన గత సినిమాలతో పోల్చుకుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాబట్టి మూడో విజిల్ హీరో కోసం వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–>  బోయపాటి మార్క్ సినిమాలో కనిపించిన ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ తొందరగా ముగించేయాలి అనే ప్రయత్నంలో కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా నడిపించేసాడు.

–> చాలా ఏళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన  అలనాటి బ్యూటీ వాణీ విశ్వనాధ్ పాత్ర ప్రారంబించే విధానం గొప్పగా ఉన్న తర్వాత ఆ పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేయడం కాస్త నిరాశ కలిగిస్తుంది.

–> సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ పాత్రతో కాస్తా ఎంటర్ టైన్మెంట్ పండించే అవకాశం ఉన్నా ఆ పాత్రని కేవలం అందాల ప్రదర్శనకి, ఒక పాట, రెండు సీన్స్ కి పరిమితం చేసాడు. అలాగే సినిమాలో వినోదం కాస్త మిస్ అయ్యింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–>  సినిమాలో  ఆడియన్స్ కి ఊపిచ్చే సన్నివేశాలు ఓ నాలుగు ఉంట్. ఆపై సినిమాని ఎలా నడిపించినా చూస్తారు. అని బోయపాటి మరోసారి రుజువు చేసాడు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : జయ జానకి నాయక సినిమా ఎలా ఉంది ?
మిస్టర్ బి : అబ్బో ఆ హీరో విలన్స్ ని ఏం కొట్టాడు.. అలాంటి లవర్ ఉండాలి.
మిస్టర్ ఏ : అవునవును..  లవ్ చేస్తే అలానే చేయాలి.

Comments