ప్రచురణ తేదీ : Dec 7, 2017 2:25 AM IST

చ‌ంద్ర‌బాబు వాడుకుని వ‌దిలేస్తార‌ని నాకు తెలీదా?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లోని భావోద్వేగం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ స్పీచ్ విని తీరాల్సిందే. అత‌డి భావ‌జాలంలోని ఎమోష‌న్ ఎలా ఉంటుందో విజువ‌ల్‌గా చూసి తీరాల్సిందే. చంద్ర‌బాబుతో చెలిమి చేసిన జ‌న‌సేనానికి ఇత‌ర పార్టీల వాళ్లు ఎలా దారి మళ్లించాల‌ని చూశారో ఆయ‌న ఎంతో ఉద్వేగంగా చెప్పారు నేటి పార్టీ స‌మావేశంలో. విశాఖలో జ‌న‌సేన‌ కార్య‌క‌ర్త‌లే నోరెళ్ల బెట్టే పంచ్‌లు విసిరారు ప‌వ‌న్‌. అస‌లింత‌కీ ప‌వ‌న్ ఏమ‌న్నారు?

“ఒక భావ‌జాలాన్ని, ఆలోచ‌న‌ను జ‌నంలోకి తీసుకెళ్లే ముందు జ‌న‌సేన అనే పార్టీ ఆవిర్భ‌వించాలి. నేను అనే వాడిని ఉండాలి ఫ‌స్ట్‌. భార‌తీయ జ‌న‌తా పార్టీవాళ్లు, తెలుగు దేశం వాళ్లు అంద‌రూ చెబుతుంటారు. మిమ్మల్ని చంద్ర‌బాబు నాయుడు గారు వాడుకుని వ‌దిలేస్తారు అని చెబుతుంటారు. నాకు తెలీదా? ఆయ‌న మిమ్మ‌ల్ని దెబ్బ కొట్టేస్తారు.. అంటారు. నాకు తెలీదా? చెప్పాలా నాకు? ఇవ‌న్నీ తెలియ‌కుండానే రాజ‌కీయాల్లోకి వ‌స్తామా? అరే .. పీఆర్‌పీ ఫౌండ‌ర్ మెంబ‌ర్‌ని నేను. పార్టీవాళ్లే దెబ్బ కొట్టేస్తారు. సొంత మ‌నుషులే దెబ్బ కొట్టేస్తారు. బ‌య‌టోళ్లు ఎందుకు దెబ్బ కొట్ట‌రు. సొంతోళ్లే దెబ్బ కొట్టిన‌ప్పుడు బ‌య‌టోళ్లు ఎందుకు కొట్ట‌రు. కొట్టేస్తారు.. చంపేస్తారు వీలైతే. అది త‌ప్ప‌దు. అది యుద్ధం.. ఎదిరించాలి.. “ అంటూ త‌న‌దైన స్పీచ్ వినిపించి, ప్ర‌త్య‌ర్థుల‌కు క‌ళ్లు భైర్లు క‌మ్మేలా చేశారు.

Comments