బాబు ధర్మపోరాటంలో పవన్ ట్వీట్ల అలజడి

నటి శ్రీరెడ్డి వివాదం నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు అధికార తెలుగుదేశం పార్టీలో అలజడి రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌, టీడీపీ అనుకూల మీడియా చానెళ్లు కలిసి తన కుటుంబంపై అత్యాచారం సాగిస్తున్నారని, డబ్బులిప్పించిమరీ తల్లిని దారుణంగా తిట్టించారంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో చర్చజరినట్లు సమాచారం.

ఒక్కరోజు దీక్ష చేస్తోన్న చంద్రబాబు నాయుడు సైతం పవన్‌ వ్యాఖ్యలపై ఆరాతీసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రస్తుతానికి ఎవరూ మాట్లాడొద్దని నేతలకు హుకుం జారీఅయినట్లు తెలిసింది. పవన్‌ చేసినవి అతితీవ్రమైన వ్యాఖ్యలు కావడంతో వాటిపై ఎలా స్పందిస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయోనని టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. మాజీ మిత్రుడు పవన్‌ ఇంకా ఎలాంటి అంశాలను బయటపెడతాడోనని ఆందోళన చెందిన టీడీపీ నేతులు.. ఈ మేరకు మరిన్ని ట్వీట్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Comments