పవన్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి: జనసేన వ్యూహకర్త

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో జనసేన పార్టీ సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. రీసెంట్ గా పార్టీ కార్యాలయంలో జరిపిన సమావేశంలో పవన్ పార్టీ ముఖ్య నేతలతో చాలా సేపు చర్చించారు. అలాగే పార్టీ రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ అనే వ్యక్తిని పరిచయం చేశారు. ఇక దేవ్ పార్టీ సమక్షంలో తనను తాను పరిచయం చేసుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేయాలని మాట్లాడారు.

నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వివిధ రకాల పార్టీలతో నేను పనిచేశాను. దశాబ్ద కాలంగా ఉన్న ఈ పాలిటిక్స్ లో నా వరకు కొంత అనుభవం ఉంది. మంచి దృక్పథం ఉన్న నాయకుడు పవన కళ్యాణ్ గారు. ప్రజల పట్ల సామజిక అంశాల పట్ల అవవగాహన ఉంది. ఎన్నికలప్పుడు మొహం చూపించే నాయకుడు కాదు. బలమైన భావజాలాల్ని అలాగే మంచి సిద్ధాంతాల్ని పార్టీ కోసం రూపొందించారు.
వాటికి పటిష్టమైన వ్యూహాన్ని జతచేస్తే తప్పకుండా అధికారంలోకి రావచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు సిద్దాంతాతలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే విషయంపై ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటాను అని దేవ్ వివరించారు. అంతే కాకుండా బూత్ స్థాయి నుంచి పార్టీని బలంగా మార్చడానికి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేద్దామని తెలియజేశారు.

Comments