ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

జనసేనానికి ఆ జిల్లాలో ఏ సమస్య కనిపించిందో..?

pavan-kakinada
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యలపై పోరాటాన్ని ఆపడం లేదు.వరుస బహిరంగ సభలు, సమస్యలు ఉన్న చోట ప్రజలతో ముఖా ముఖి నిర్వహిస్తూ వారి సమస్యలను వెలుగులోకి తీసుకుని వస్తున్నారు.వరుసగా తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో బహిరంగ సభలు నిర్వహించిన పవన్ మధ్యలో మెగా పుడ్ పార్క్, ఉద్దానం కిడ్నీ సమస్య లతో భాదపడుతున్న ప్రజలతో ముఖాముఖి సమావేశాలు కూడా ఏర్పాటు చేసి వారి సమస్యలను హైలైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్దానం సమస్య పై పవన్ స్పందించిన వెంటనే ఉపశమన చర్యలకు ఉపక్రమించింది.

కాగా జనసేన అధినేత త్వరలో మరో బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. జనసేనాని తన తదుపరి బహిరంగ సభని ఒంగోలులో నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి చివరి వారంలో ఈ బహిరంగ సభ జరిగే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలనుంచి సమాచారం అందుతోంది.అక్కడ స్థానికంగా ఒంగోలు జిల్లాలో ఉన్న సమస్యలపై పవన్ తన బహిరంగ సభలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. బహిరంగ సభల ద్వారానే జనసేన పార్టీని బలోపేతం చేయాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించి తద్వారా జనసేన పార్టీ ప్రజా సమస్యలపై స్పందిస్తుందన్న సంకేతాలను ప్రజలలోకి పంపాలని చూస్తున్నారు. తిరుపతి, కాకినాడలలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని ధ్వజమెత్తిన పవన్, అనంతపురంలో కరువు సమస్యని హైలైట్ చేశారు. ఈ నేపథ్యంలో ఒంగోలు లో ఎలాంటి సమస్యలను వెలుగులోకి తెస్తారన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

Comments