ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

పులివెందులలో వైఎస్ కుటుంబం రక్తం పారిస్తే…చంద్రబాబు మాత్రం నీళ్లు పారిస్తున్నారు

jalil-khan
తెలుగుదేశం నాయకులు మరొకసారి వైస్సార్సీపీ అధినేత జగన్ ఫై విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్టేట్ గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడారు. జలీల్ ఖాన్ మాట్లాడుతూ… విజయవాడను రాజధానిగా ప్రకటించినప్పుడు తాను బల్లలపై కొట్టినందుకు జగన్ తనపై కక్ష పెంచుకున్నాడని అన్నారు. వైఎస్ పూర్తి చేయలేని పనిని చంద్రబాబు పూర్తి చేసారని, వైఎస్ కుటుంబం పులివెందులలో రక్తం పారిస్తే… చంద్రబాబు మాత్రం అక్కడ నీళ్లు పారించారని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. మాట్లాడితే జగన్ తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తానని అంటున్నాడని, చంద్రబాబుపై అనవసర విమర్శలు చేస్తున్నాడని, ప్రజలే త్వరలో జగన్ ను నల్ల సముద్రంలో కలిపేస్తారని జలీల్ ధ్వజమెత్తారు. దేవినేని మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ లో ఉన్నపుడు పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తే చంద్రబాబును 500 కార్లలో ఊరేగిస్తానని చెప్పానని, అలాగే చంద్రబాబు పట్టిసీమను పూర్తి చేసారని అన్నారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఎవరైనా చేస్తారని, వాటిని పూర్తి చేయడమే ప్రధాన ఆశయంగా ఉండాలని అన్నారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. కమిషన్ కోసం జల యజ్ఞానికి, ప్రభుత్వ పథకాలకు కేవీపీ దళారీగా పని చేశారని విమర్శించారు.

Comments