ప్రచురణ తేదీ : Dec 29, 2016 2:51 PM IST

బీకామ్ లో మాథ్స్ , ఫిజిక్స్ చదివిన ఇంటెలిజెంట్ ఎమ్మెల్యే ..!!

jaleel-khan
రాజకీయ నాయకులలో విద్యావంతులు ఉన్నారు.. అసలు చదువు రానివారు కూడా ఉన్నారు. కానీ ఒక గ్రూప్ లో చదవ వలసిన సబ్జెక్టు లను వేరే గ్రూప్ లో చదివే ఉత్తములు ఉంటారా ? ఎందుకు లేరు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉన్నాడుగా..అసలు విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదవండి..విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అయిన జలీల్ ఖాన్ టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో అదే సమయంలో పార్టీ మారడంతో ఆయన వార్తల్లో నిలిచారు.కొద్ది రోజుల క్రితమే ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ని ఇచ్చారు. ఈ ఇంటర్ వ్యూ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనితో సోషల్ మీడియా లో అతనిపై సెటైర్ లు, జోకులు పేలుతున్నాయి.

ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఆయన విద్యార్హత గురించి అడిగారు. దీనితో తాను బికాం చదివినట్లు సమాధానమిచ్చాడు.కామర్స్ మీద ఆసక్తితో బీకామ్ చదివారా ? అని యాంకర్ ప్రశ్నించగా..అదేం లేదని తనకు మాథ్స్ , ఫిజిక్స్ సబ్జెక్టు లు అంటే ఇష్టమని అందుకే బీకామ్ చదివానని ఎమ్మెల్యే సమాధానమివ్వడంతో ఆశ్చర్యపోయిన యాంకర్ బీకామ్ లో మాథ్స్ , ఫిజిక్స్ సబ్జెక్టు లు ఉండవుకదా.. అని ప్రశ్నించాడు.దీనికి ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానం “ఎందుకుండవు .. ఉంటాయి ” అని సమాధానమివ్వడంతో ఆశ్చర్యపోవడం యాంకర్ వంతైంది.తనుకూడా బీకామ్ స్టూడెంట్ నే అని బీకామ్ లో ఉన్న సబ్జెక్టు లను వివరించాడు. దీనితో మరో మారు సమాధానమిచ్చిన ఎమ్మెల్యే ఫిజిక్స్ ఉండదేమోకానీ.. మాథ్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని వాదించడంతో యాంకర్ కూడా ఇక చేసేది ఏమీ లేక కాంప్రమైజ్ అయిపోయాడు.దీనితో జలీల్ ఖాన్ పై సోషల్ మీడియా లో సెటైర్ లు, జోకులు పేలుతున్నాయి.

Comments