ప్రచురణ తేదీ : Thu, Sep 21st, 2017

రివ్యూ రాజా తీన్‌మార్ : జై లవ కుశ – ఎన్టీఆర్ లేకుంటే బొమ్మ బోల్తానే

తెరపై కనిపించిన వారు : ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేత థామస్
కెప్టెన్ ఆఫ్ ‘జై లవ కుశ’ : బాబీ

మూల కథ :

అన్నదమ్ములైన ముగ్గురు జై, లవ, కుశ లు రామలక్ష్మణ, భరతుల్లా పెరగాలని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. కానీ ముగ్గురిలో కొంత లోపంతో పుట్టిన పెద్దవాడు జై చిన్నతనంలో ఎదురైనా అవమానాలు కారణంగా మనసు గాయపడి రాక్షసుడిలా మారతాడు.

ఇష్టమైన గుర్తింపును పొందడం కోసమే చిన్నతనంలోనే దూరమైన లవ, కుశలను తిరిగి మళ్ళీ తన దగ్గరకే రప్పించుకుని పంతం నెగ్గించుకోవాలని చూస్తాడు. అసలు జై పొందాలనుకున్న గుర్తింపు ఏమిటి ? లవ, కుశలను ఎందుకు తన వద్దకు రప్పించుకున్నాడు ? చివరికి ఆ ముగ్గురి అన్నదమ్ముల జీవితం ఏమైంది ? అనేదే సినిమా..

విజిల్ పోడు :

⤏ మొదటి విజిల్ ఎన్టీఆర్ నటనకు వేయాలి. జై, లవ, కుశ మూడు పాత్రల్లో మూడు విధాలుగా నటించి మెప్పించాడు తారక్. ఎక్కడా పాలనా పాత్రలో పైలాన్ సీన్లో సరిగా చేయలేకపోయాడు అనే వంక పెట్టడానికి లేకుండా సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే మోశాడు. ముఖ్యంగా జై పాత్రలో చాలా బాగా నటించాడు.

⤏ ఇక దర్శకుడు బాబీ రాసిన మూడు పాత్రల్లో నెగెటివ్ షేడ్స్ కలిగిన జై పాత్ర చాలా బాగుంది. ఆ పాటర్ కనబడే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంది. సినిమా కూడా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి ఆ పాత్రకు రెండో విజిల్ వేసుకోవచ్చు.

⤏ ఇక సినిమా లైన్ కొంచెం కొత్తగా ఉంది. అలాగే ఫస్టాఫ్ కథనం కొంత మేర, సెకండాఫ్లో అన్నదమ్ముల సెంటిమెంట్ బాగున్నాయి. కాబట్టి ఈ అంశాలకు మూడో విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

⤏ సినిమాలో కోన వెంకట్, చక్రవర్తిలు రాసిన కథనం చాలా వరకు బోర్ కొట్టించింది. పెద్దగా కొత్తదనమనేదే కనబడలేదు.

⤏ సినిమా ఆరంభం, ఇంటర్వెల్ బ్లాక్ బాగున్నా సెకండాఫ్ నుండి సినిమా పరమ రొటీన్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది.

⤏ ఇక సినిమాను ముందుకేజు నడిపే సన్నివేశాలకు పెద్దగా బలమైన రీజన్స్ అనేవి కనబడవు. ఉదాహరణకు చిన్నతనంలో విడిపోయిన అన్నదమ్ములు కలుసుకోవడం వంటివి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

⤏ సినిమాలో పెద్దగా ఆశ్చర్యపోయే సన్నివేశాలేవీ లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా ఎలా ఉంది ?
మిస్టర్ బి : ఎన్టీఆర్ చాలా బాగా చేశాడంతే.
మిస్టర్ ఏ : అయితే టోటల్ గా రిజల్ట్ ఏంటి ?
మిస్టర్ బి : ఏముంది.. ఎన్టీఆర్ లేకుంటే బొమ్మ బోల్తా అంతే.

Comments