ప్రచురణ తేదీ : Sep 30, 2017 3:58 AM IST

జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఇదే..జోతిష్యం చూసుకుని మరీ..!


వైసిపి అధినేత జగన్ పాదయాత్రలో మార్పు చోటు చేసుకుంది. ముందుగా అనుకున్న ప్రకారం అక్టోబర్ 27 నుంచి కాకుండా నవంబర్ 2 నుంచి జగన్ పాదయత్రని మొదలుపెట్ట బోతున్నారు. పాదయాత్ర ప్రారంభించే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. దర్శనానంతరం ఇడుపులపాయకు చేరుకొని పాదయత్రని ప్రారంభిస్తారు. ఈ మేరకు వైసిపి జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ని సిద్ధం చేసింది.

కడప జిల్లా నుంచి మొదలైన జగన్ పాదయాత్ర అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల మీదుగా రాయలసీమలో ముగుస్తుంది. కోస్త ఆంధ్రలో నెల్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నెల్లూరు మొదలుకుని ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలు,విజయనగరం, విశాఖ చేరుకొని చివరగా శ్రీకాకుళంలోని ఇచ్చాపురంలో పాదయత్రని జగన్ పూర్తి చేయనున్నారు.

గతంలో వైఎస్రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారం లోకి వచ్చాడు. ఆయన తనయుడు జగన్ ప్రస్తుతం అదే పంథాని ఫాలో కాబోతున్నారు. జగన్ పాదయాత్ర వార్తతో నంద్యాల, కాకినాడ ఫలితాలతో డీలాపడిన పార్టీ కేడర్ కు పునరుత్తేజం లభించింది. కాగా పాదయాత్ర కోసం జగన్ భారీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. జ్యోతిష్యుల సలహా మేరకు జగన్ పాదయాత్ర ముహూర్తం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి.

Comments