ప్రచురణ తేదీ : Jan 22, 2017 1:40 AM IST

అమ‌రావతిలో జ‌గ‌న్‌కి సొంతిల్లు?

jagan1
ఇప్ప‌టికిప్పుడు అమ‌రావ‌తిలో ఏపీ ప్ర‌తిపక్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ సొంతంగా ఇల్లు క‌ట్టుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏంటి? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం వ‌చ్చేసింది. రాజ‌ధాని నిర్మాణం కోసం ఏపీ ప్ర‌భుత్వం భారీగా భూముల్ని సేక‌రించేందుకు రెడీ అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల త‌రపున నిలిచి పోరాడాలంటే స్థానికంగా ఉండి తీరాలి. అందుకే నిన్న‌టిరోజున జ‌గ‌న్ ఆ మాట అన్నారు. ఇక్క‌డే సొంతిల్లు క‌ట్టుకుని నివాసం ఉంటాన‌ని ప్ర‌జ‌ల‌కు మాటిచ్చారు. రెండున్న‌రేళ్లుగా ఇదే మాట‌ను త‌మ పార్టీ నేత‌లు ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నా ప‌ట్టించుకోని జ‌గ‌న్ ఉన్న ఫ‌ళాన ప్లేటు ఫిరాయించి ఇల్లు క‌ట్టేసుకుంటాన‌ని ఎందుకు ఆన్నారు? అని మ‌రో ప్ర‌శ్న వేస్తే దానికి కూడా స‌మాధానం రెడీగా ఉంది.

ఏపీలో ఫిబ్ర‌వ‌రి లేదా మార్చిలో కొత్త అసెంబ్లీలో స‌మావేశాలు జ‌రుగుతాయి. అప్ప‌టికి త‌న చెంత స‌మాధానం రెడీగా ఉండాలి. స్థానిక‌త అన్న‌ది అప్పుడు పెద్ద ఇష్యూ కావ‌చ్చు. దానిపై జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఆలోచించి అమ‌రావ‌తిలో సొంతిల్లు ప్లాన్ వేశార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. వాస్త‌వానికి అమ‌రావ‌తి రావ‌డం జ‌గ‌న్‌కి ఇష్టం లేక‌పోయినా.. ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అసెంబ్లీ స‌మావేశాల్లో తేదేపా త‌న‌ని ప్ర‌శ్నించ‌కుండానే ఈ ఏర్పాట్లు. ముందుగానే ఓ మాట అనేశాడు కాబ‌ట్టి ఇక నిర్మాణం మొద‌లు పెట్ట‌డ‌మే ఆల‌స్యం. మ‌రి ఈ ఇల్లు ఎప్ప‌టికి రెడీ చేసుకుంటాడో?

Comments