ప్రచురణ తేదీ : Fri, Aug 11th, 2017

నేనే రాజు – జగన్? కాదు నేనే రాజు – చంద్రబాబు? అది చెప్పేది ఎవరు?

ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికలు కీలక ఘట్టం నడుస్తుంది. ఎన్నడూ లేని స్థాయిలో రెండు పార్టీలు పోటీ పడుతూ తన ప్రభావం చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు నేనే రాజు, నేనే మంత్రి సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది. ఇదే సందర్భంగా రాజకీయ పార్టీల్లో మధ్యా ఓ ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ నంద్యాల ఉప ఎన్నికల్లో హీరో ఎవరు? విలన్ ఎవరు? ఇక ఈ ఎన్నుకల్లో నేనే రాజు నేనే మంత్రి అనిపించుకునే అర్హత ఎవరికి ఉంది అనే చర్చ నాయకులు, కార్యకర్తల మధ్య నడుస్తున్నట్లు సమాచారం. ఏపీలో రేపటి రాజు అనిపించుకోవాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే. ఏపీకి మరో 10 ఏళ్ళు నేనే రాజుగా ఉండాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో ఇటు వైపు జగన్ మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయం తెలుస్తుంది నేనే రాజు అవుతా అంటూ ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. మరో వైపు చంద్రబాబు కూడా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది ఈ ఎన్నికల్లో నేనే రాజు అంటూ ప్రచారం చేస్తున్నాడు. మరి ఇద్దరు చెప్పే మాట ఒకటే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని, మరి ఆ న్యాయం ఎవరి వైపు ఉంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అలాగే ఈ ఎన్నికల్లో రాజు అయేది ఎవరో కూడా ప్రజలే నిర్ణయిస్తారు. అంత వరకు ఈ రంగస్థలంలో నాటకం చూస్తూ ఉండాల్సిందే.

Comments