ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

చంద్రబాబు అనుమానం నిజమేనా.. బ్యాక్ గ్రౌండ్ వర్క్ బాగానే జరిపారా ?

ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో నెలకొంటున్న పరిస్థితులను చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో ఆ పార్టీ అధిష్టానానికి అంతు చిక్కడం లేదట. రోజుకు ఎక్కడో ఒక చోట పార్టీ నేతలు మాట మాట అనుకుంటున్నారని ఈ మధ్య మీడియాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు కూడా తెలుగు తమ్ముళ్లపై కాస్త సీరియస్ గానే ఉంటున్నారట. అసలు పార్టీలో నాయకుల మధ్య ఎన్నడు లేనిది ఈ వైరాలు ఏమిటని కొందరు నేతలు అనుకుంటున్నారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న టీడీపీ ని కాదని ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసిపిలోకి వెళ్లడం ఏమిటని చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. వైసిపి గెలుస్తుందనే నమ్మకంతో వెళుతున్నారా లేక పార్టీ ఏమైనా అఫర్ చేసిందా అనే కోణంలో కూడా పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

గత 20 ఏళ్లుగా పార్టీని ముందుండి నడిపిస్తున్న చంద్రబాబు కి ఏ రాజకీయ నాయకుడు ఎలాంటి వాడో తప్పకుండా తెలిసే ఉంటుందట. సో అందుకే పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారనేది తెలుగు తమ్ముళ్ల వాదన. మరలాంటప్పుడు టీడీపీ నేతలు చంద్రబాబు కు ఓ మాటైనా చెప్పకుండా ఎందుకు వలసలు వెళ్లినట్టు ? .. సాధారణంగా రాజకీయ నాయకులు పార్టీలు మారడం కామన్ కానీ గత కొన్నేళ్లుగా చూసుకుంటే ఈ సారి పార్టీ నాయకులు చాలానే మారరరని అందుకు కొంత బ్యాక్ గ్రౌండ్ ఆపరేషన్స్ జరిగాయని టాక్ బాగానే ఉంది. ఇంకా ముందు కూడా ఎలక్షన్స్ వచ్చే లోపు నాయకులు పక్క పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి 2019 ఎలక్షన్స్ లోపు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో అందరప్రదేశ్ రాజకీయాలు..

Comments