ప్రచురణ తేదీ : Dec 6, 2017 8:37 AM IST

‘చంద్రన్న మాల్స్’ పై జగనన్నకి ఇన్ని డౌట్సా..!

త్వరలో ఏపీ ప్రభుత్వం చంద్రన్న మాల్స్ పేరుతో రేషన్ షాపుల్లో సరికొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. పరిపాలనని ఆధునీకరించడంలో చంద్రబాబు మరో మారు తన ప్రత్యేక చాటుకున్నారు. రేషన్ డీలర్ల ఆదాయం పెరిగేలా, సామాన్యులకు అన్ని సరుకులు సబ్సిడీకి అందేలా చంద్రన్న మాల్స్ పథకం ఉండబోతుందని ఇటీవలే మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. చంద్రన్న మాల్స్ ద్వారా బయటకంటె 20 శాతం తక్కువ ధరలకే సరుకులు అందిస్తామని మంత్రి అన్నారు.

ఇదిలా ఉండగా పతిపక్ష నేత జగన్ పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరుని ఎండగడుతున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా చంద్రన్న మాల్స్ పై జగన్ లేవనెత్తిన అనుమానాలు సంచలనం కలిగిస్తున్నాయి. చంద్రబాబు మరో మోసకారి పథకాన్ని అమలు చేయబోతున్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు. రిలయన్స్, చంద్రబాబు హెరిటేజ్ తో సంబంధం ఉన్న ఫ్యూచర్ గ్రూప్ లకు లబ్ది చేకూరేందుకే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారనేది జగన్ ఆరోపణ.

బాబు రాక ముందు వరకు రేషన్ షాపుల్లో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం మినహా మరేమి ఇవ్వడం లేదు. అదికూడా వేలిముద్రలు సరిగా పడడం లేదని ఆపేస్తున్నారు. రేషన్ షాపుల్లో ఇప్పుడేదో మాల్స్ పెడతానని అంటున్నారు. చంద్రబాబు రాక ముందు బడ్జెట్ లో సబ్సిడీ సరుకుల బిల్లే రూ 3000 కోట్ల వరకు ఉండేది. ఇప్పడు రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ భాగస్వామ్యంతో 20 శాతం తక్కువ ధరలకే ఇస్తారట. ప్రజలని మోసం చేయడానికే ఈ కొత్త ఎత్తుగడ అని మనవి చేసుకుంటున్నా అంటూ జగన్ తాడిపత్రి పాదయాత్రలో తన అనుమానాల్ని లేవనెత్తారు.

Comments