ప్రచురణ తేదీ : Oct 13, 2017 11:43 AM IST

ఆరునెలలు అనుమతి ఇవ్వండి..మళ్లీ వస్తానంటున్న జగన్..!

వైసిపి అధినేత జగన్ పాదయాత్రలు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్ విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసి తీరుతారనే ధీమాతో వైసిపి క్యాడర్ ఉంది. కానీ జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారమే దీనికి పెద్ద అడ్డంకిగా మారె అవకాశాలు కనిపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో భాగంగా ప్రతి శుక్రవారం జగన్ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. తాను పాదయాత్ర చేయబోతున్నాను కాబట్టి ఆరు నెలలు వ్యక్తి గత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నేడు విచారణకు రానుంది.

వైసీపీపై ప్రజల్లో నమ్మకం సడలకుండా ఉండాలన్నా, 2019 ఎన్నికల నేపథ్యంలో పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకుని రావాలన్నా జగన్ అందుకు తగ్గట్లు గా పెద్ద కార్యక్రమం చేయవలసి ఉంటుంది. పాదయాత్రే ప్రజలని చేరుకోవడానికి సరైన మార్గమని జగన్ భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా 125 నియోజకవర్గాలు చుట్టేలా జగన్ పాదయాత్ర ప్రణాళిక ఉంది. నవంబర్ నుంచి జగన్ పాదయాత్ర మొదలు కావలసి ఉన్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరుస్తుందనేదని ఆసక్తిగా మారింది.

Comments