ప్రజల వద్దే జగన్ బేరసారాలు..2 వేలు..కాదు 3 వేలు..!

ఈ సారి జగన్, చంద్రబాబు ప్రజల వద్దే హామీల వేలం పాట పాడేటట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో సెంటిమెట్ తో ఓట్లు పడతాయని భావించిన జగన్ మేనిఫెస్టోని లైట్ తీసుకున్నారు. పర్యవసానంగా చంద్రబాబుకు అధికారం సునాయాసమైంది. 2019 ఎన్నికల నేపథ్యంలో రూపొందించే మేనిఫెస్టో టిడిపి ఏమాత్రం తగ్గకూడదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాబు బంగారం ఇస్తానని హామిఇస్తే, మనం డైమండ్ అనాల్సిందే అనేలా జగన్ పార్టీ నేతలకు హిత బోధ చేశారట.

జగన్ రెండవరోజు పాదయాత్రలో ఇలాంటి ఆసక్తికర సన్నివేశమే చోటు చేసుకుంది. వేంపల్లి చేరుకున్న జగన్ అక్కడ రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జగన్ గ్రామస్థులతో మాట్లాడారు. చంద్రబాబుది దుర్మార్గపు పాలన అని అన్నారు. బాబు ప్రకటించిన మేనిఫెస్టో మోసాల పూరితమని అభివర్ణించారు. ఏడాది పాటు ఓపిక పడితే తాను ముఖ్యమంత్రి అవుతానని అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్లు రూ 2 వేలు ఇస్తా.. బాబు 2 వేలు ఇస్తే తాను 3 వేలు ఇస్తానంటూ ప్రజల వద్దే బేరాలు ఆడడం ఆసక్తికరంగా మారింది.

Comments