ప్రచురణ తేదీ : Thu, Jun 14th, 2018

జగన్ పిలిస్తే రాకుండా అవమానపరిచారు.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బ్రాహ్మణ ఆత్మీయ సభకు రాకపోవడం వివాదాస్పదంగా మారింది. బ్రాహ్మణులను జగన్ తీవ్రంగా అవమానించారు అంటూ ఏపీ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధుల నుంచి విమర్శలు వస్తున్నాయి. జగన్ వస్తారనుకొని నమ్మకంతో తాము సభను నిర్వహిస్తే కనీసం ఆయన వివరణ కూడా ఇవ్వకుండా తేలిగ్గా తీసిపారేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాము అంత తేలిగ్గా తీసుకోమని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.

సభ ఘనంగా నిర్వహిస్తున్నారని దాదాపు 13 జిల్లాల నుంచి బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు వచ్చారు. జగన్ వస్తానని చెప్పి రాకుండా తమను అవమానపరిచారని అందుకు తగ్గ వివరణ మరో రెండు రోజుల్లో వైసిపి నేతలు ఇవ్వాలని బ్రాహ్మణా సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఆయన సమాధానం ఇవ్వకుంటే వ్యతిరేకఖంగా వెళ్లాల్సి ఉంటుందని త్వరలో ప్రారంభమయ్యే బస్సు యాత్రలో జగన్ చేసిన అవమానాన్ని అందరికి తెలిసేలా చేస్తామని వారు తెలియజేశారు.

Comments