ప్రచురణ తేదీ : Sun, Aug 13th, 2017

జగన్ ముఖ్యమంత్రి… పవన్ హోం మినిస్టర్? సోషల్ మీడియా ప్రచారం?


రాజకీయాల్లో సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరికి తెలియదు. అలాగే ఎవరు ఎవరితో దోస్తీ కడతారో ఆ విషయం అస్సలు తెలియదు. దోస్తీ లేనపుడు చెడ్డవాడిగా అనిపించిన వాడు దోస్తీ కట్టాక మంచోడు అవుతాడు. ఇది ఎప్పుడు ఉన్న.. అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ ఒకే రాజకీయ వేదిక మీదకి వస్తారని. రానున్న ఎన్నికల్లో ఇద్దరు జతకడతారని. దీనికి బలం చేర్కూర్చే విధంగా కొన్ని ఉదాహారణలు కూడా చెబుతున్నారు. రానున్నది రామ రాజ్యం అని జగన్ తన ప్రతి మీటింగ్ లో చెబుతూ ఉన్నాడు. మరో వైపు పవన్ కూడా ప్రజల సమస్యల పరిష్కారమే తన అబిమతం అని దాని కోసం ఎవరితో అయిన జత కట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నా అని చాలా వేదికల మీద చెప్పాడు. అలాగే ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఏపీలో ఉన్న సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉండి జగన్ పోరాటం చేస్తూ ఉంటె, కేవలం ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకున్న పవన్ తన పోరాటాన్ని తన అభిమతమ, సిద్ధాంతం ప్రకారం కొనసాగిస్తూ వెళ్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో జగన్, పవన్ మధ్య ఒక సహ్రుద్బావ వాతావరణం నెలకొందని సమాచారం. ఇద్దరి మధ్య రహస్య మీటింగ్స్ జరిగాయని. ఇండస్ట్రీలో ఓ పెద్ద వ్యక్తి ఇద్దరి మధ్య వారధిగా పని చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. జగన్, పవన్ కలిస్తే ఏపీలో ఓ కొత్త రాష్ట్రం ప్రజలు చూస్తారని అభిమానులు, ప్రజలు ఆశిస్తున్నారని, అందుకే ఇద్దరు కలిసి పని చేయాలని ఆ రహస్య రాజనీతి వేత్త పొత్తు కుదిరేలా చేస్తున్నాడని సమాచారం బలంగా వినిపిస్తుంది. అయితే ఇందులో నిజానిజాలు ఏంటో తెలియదు గాని, ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటె. మరో వైపు ఈ సమాచారం తెలిసిన టీడీపీ నేతలు మాత్రం కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి జగన్, పవన్ కలయిక సాధ్యమేనా, ఒక వేల సాధ్యమైతే ఇద్దరి మధ్య జరిగిన ఆ అధికారిక ఒప్పందం ఏమిటి అనేది ప్రస్తుతానికి అయితే రహస్యమే.

Comments