వంటలు ఇంత దారుణంగా వండితే ఎలా జడేజా..పరువు పాయె..!


భారత క్రికెటర్ రవీంద్ర జడేజా పరువు బయట మంట గలిసింది. రాజ్ కోట్ లో జడేజాకు చెందిన రెస్టారెంట్ లో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జడేజాకు చెందిన రెస్టారెంట్ లో ఆహార పదార్థాలు గురించి కస్టమర్లు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయట పడింది. ఆరోగ్య శాఖ అధికారులు శనివారం జడేజా రెస్టారెంట్ పై దాడులు నిర్వహించారు.

జడేజా సోదరి నయన అనిరుద్దీన్ రెస్టారెంట్ యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువకాలం నిల్వ ఉంచిన పదార్థాలని కస్టమర్లకు వడ్డిస్తునట్లు, ఆహార పదర్థాలలో కుత్రిమ రంగులు ఉపయోగిస్తున్నట్లు తాము గుర్తించాలని అధికారులు మీడియాకు వివరించారు. దీనితో జడేజా సోదరికి అధికారులు నోటిలుసులు అందజేశారు. 2012 లో జడేజా ఈ రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఆ రెస్టారెంట్ అక్రమ నిర్మాణమని గత ఏడాది కేసు కూడా నమోదైంది.

Comments