ప్రచురణ తేదీ : Fri, Apr 21st, 2017

పవన్ కళ్యాణ్ కి, గౌతమ బుద్దుడికి లింక్..?


పవన్ – త్రివిక్రమ్ ల చిత్రం గురించి రోజుకో వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. చిత్ర నటీనటుల విషయం తప్ప మరే విషయాన్ని చిత్రయూనిట్ బయట పెట్టడం లేదు. దీనితో రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.త్రివిక్రమ్ గతంలో మహేష్ బాబుతో ఆధ్యాత్మిక భావాలతో ఖలేజా చిత్రాన్ని తీసిన విషయం తెలిసిందే. ఓ గ్రామ ప్రజలను రక్షించి వారి దృష్టిలో మహేష్ దేవుడిగా మిగిలి పోతాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాత్రకూడా అదే తరహాలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ పాత్రని గౌతమ బుద్దుడి భావాలతో రాశాడని అంటున్నారు. మాటల్లో దివ్యత్వం, శాంతి లాంటి అంశాలు ఉంటాయని ఈవార్తని బట్టి తెలుస్తోంది. కాగా ఇది కేవలం పుకారు మాత్రమేనా లేక నిజామా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Comments