ప్రచురణ తేదీ : Dec 7, 2017 8:38 AM IST

వీడియో : పవన్ ఆవేశం..శేఖర్ కమ్ములని అపార్థం..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ సంచలనాత్మకంగా సాగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు జనసేనాని మద్దత్తు ప్రకటించారు. అంతవరకు పవన్ కళ్యాణ్ ప్రసంగం సూపర్ సక్సెస్ అయింది. కానీ జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేసే సమయంలో మరో మారు ప్రసంగించారు. ఇక్కడే అనేక వివాదాలకు పవన్ ఆస్కారం ఇచ్చినట్లు అయింది. గడిచిపోయిన ప్రజారాజ్యం తాలూకు చేదు అనుభవాలను గుర్తు చేసుకున్న జనసేనాని ఆవేశంగా ప్రసంగించారు. చిరంజీవికి దగ్గరే ఉంటూ ద్రోహం చేసిన వారిని చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇస్తామని ప్రకటించడం, వాళ్ళందరిని మరచిపోలేదని అనడం తాజా వివాదంగా మారింది.

మరో వైపు పరకాల ప్రభాకర్ విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. ప్రజారాజ్యం పార్టీలో స్వేచ్ఛ లేదని ఆయన పార్టీ ఆఫీస్ లో కూర్చునే ప్రకటించారని అంతకంటే స్వేచ్ఛ ఏముంటుందని పవన్ అన్నారు. పాయింటే అయినా పీఆర్పీ అనేది గతం. అలాంటప్పుడు వ్యక్తులపై టార్గెట్ చేయడం వలన పవన్ కు ఒరిగేది ఏముందని ప్రశ్న జనసేనానికి ఎదురవుతోంది. ఇక్కడ మరో అంశాల్ని కూడా పవన్ కళ్యాణ్ అనవసరంగా ప్రస్తావించారని విమర్శలు ఎదురవుతున్నాయి. పవన్ పార్టీ స్థాపించిన తొలి ప్రసంగాన్ని శేఖర్ కమ్ముల ఆకాశానికెత్తేశారు. ఆ తరువాత విశాఖలో రెండవ సభ నిర్వహించారు. అది శేఖర్ కమ్ములకు నచ్చలేదు. ఈ విషయాన్ని కూడా జనసేనాని ప్రస్తావించడంతో నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి.

Comments