నాగం కాంగ్రెస్ లో చేరుతున్నారా?

అవును అనే వాదన కొంత వరకు బలంగా వినిపిస్తోంది. అప్పుడప్పుడు సడన్ గా మీడియా ముందుకి వచ్చి కేసీఆర్ పై మండిపడుతుంటారు నాగం. ఆయన మహబూబ్ నగర్ నుండి పార్లమెంట్ కి పోటీ చేసి ఓటమిపాలు అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను వున్న బిజెపి పార్టీ ద్వారా అధికార పక్షం టీఆరెస్ పై మరియు కేసీఆర్ పై తగు రీతిలో స్పందించలేక పోతున్న విషయాన్ని బలంగా నమ్ముతున్న నాగం, పార్టీ మారి కాంగ్రెస్ లో చేరుతారు అనే వార్త ఒకటి షికారు చేస్తోంది. ఆయన తెలంగాణ టిడిపి లో ఉండగా మంచి నాయకుడు గా గుర్తింపు ఉండేది, బిజెపి లో చేరాక ఆయనకి తగిన గుర్తింపు దొరకడంలేదని, ఈ విషయాన్ని ఆయన తన అనుచరగణం తోను, సన్నిహితులతోను చర్చించి పార్టీ మారదాం అనుకుంటున్నారు అన్న ఒక వాదన కూడా వుంది.

తెలంగాణ లో బిజెపి కి భవిష్యత్తు లేదనే ప్రచారం జరుగుతుండడం తో ఆయన కూడా తన రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నారని, అంతే కాక ఆయన కనుక కాంగ్రెస్ లో చేరితే అధిష్టానం ఆయనకు నాగర్ కర్నూల్ అసెంబ్లీ సీట్ ఇవ్వడానికి సుముఖంగా ఉందని అంటున్నారు. దీనికి మరింత ఊపు నిచ్చేలా తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం జర్నలిస్ట్ మిత్రులతో ఏర్పాటుచేసిన చిట్ చాట్ లో నాగం త్వరలో కాంగ్రెస్ లో చేరుతారని అన్నారు. నాగం చేరిక దాదాపు ఖరారు అయినట్లు, వీలైతే ఆయన సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని వినికిడి. అయితే ఈ విషయమై నాగం ని ప్రశ్నించగా తాను కాంగ్రెస్ లో వెళ్తున్నట్లు వస్తున్న వార్తల్ని పూర్తిగా ఖండించారు. తాను నిజంగా పార్టీ మారాలి అనుకుంటే తనను ఆపేవారు లేరని, తాను నిబద్దత గల వ్యక్తినని, వచ్చే ఎన్నికల్లో నగర్ కర్నూల్ నియాజకవర్గం నుండే పోటీ చేస్తానాని చెప్పుకొచ్చారు. విపక్షాల్లో సరైన నాయకుడు ఉంటే కేసీఆర్ అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు….

Comments