ప్రచురణ తేదీ : Mar 22, 2018 3:07 PM IST

ఢిల్లీలో భారీ భూకంపం రానుందా ?

ప్రస్తుతం నడుస్తున్న ఈ డిజిటల్ యుగంలో మానవుడు ఊహకందని విషయాలను ఎన్నో కనుగొంటున్నాడు.మరీ ముఖ్యంగా టెక్నాలజీ మనకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీనే మనకి ఒకింత చేటు కూడా చేస్తోంది. సోషల్ మీడియా మాధ్యమం వాట్సాప్ ప్రస్తుతం ప్రతిఒక్కరు దాదాపుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో మనం ఏదైనా గ్రూప్ లో ఉంటే చాలు, అందులో వున్న సభ్యులు అవరసమైన కాకపోయినా ఏవేవో పోస్ట్లు పెడుతుంటారు. అందులో కొన్ని ఫేక్ కూడా ఉంటున్నాయి.

అసలు విషయంఏమిటంటే రానున్న ఏప్రిల్‌ 7 నుంచి 15లోపు ఢిల్లీలో ఒక తీవ్రమైన భూకంపం రానున్నట్లు తెలుస్తోంది. రిక్టరు స్కేలు పై దాని తీవ్రత 9.1 నుండి 9.2గా నమోదు కానుంది. లక్షల మంది ప్రాణాలు కొల్పోనున్నారని, దీనికి సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) నుంచి హెచ్చరికలు కూడా వచ్చాయనే మెసేజ్‌ గత కొన్ని రోజులుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుంది. గురుగ్రామ్‌లో సంభవించబోయే ఈ భూకంపం ప్రపంచంలో అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించిన వాటిలో రెండవది కానుంది.

భారతదేశంలోని రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌, జమ్ముకాశ్మీర్‌, తమిళనాడు, బిహార్‌ రాష్ట్రాలు భూకంప ప్రభావానికి గురికానున్నాయి.అలానే పాకిస్థాన్‌లో కూడా భూకంపం రానున్నట్లు అక్కడ దీని తీవ్రత 4 నుండి 4.2 వరకు నమోదు కానున్నట్లు ఈ సందేశ సారాంశం. ఢిల్లీలో ఉంటున్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేయండి. వారిని ఒక వారం పాటు ఢిల్లీని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లమని చెప్పండి. ప్రభుత్వం తొందరలోనే దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకుంటుంది.

ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే నాసాఅలర్ట్‌.కామ్‌లో చూడండి అనేది ఆ మెసేజ్ సారాంశం. నిజంగానే అసలు ఢిల్లీలో భూకంపం రానుందా, అంటే అదేమి లేదని అంటున్నారు . ఇది ఒక ఫేక్‌ మెసేజ్‌. మెసేజ్‌లో చాలా స్పెల్లింగ్‌ మిస్టెక్‌లు ఉండటమే కాక ఒక ముఖ్యమైన ప్రాధమిక అంశాన్నే అది మర్చిపోయింది. భూకంపాలను ముందుగా గుర్తించడం సాధ్యం కాదు. ఈ వెబ్‌సైట్‌ కూడా నకిలీ వెబ్‌సైట్‌. ఇది స్పేస్‌ ఏజెన్సీ నుంచి వచ్చిన అధికారిక సమాచారం కాదని తేలడంతో ఢిల్లీ వాసులు ఊపరి పీల్చుకున్నారు. టెక్నాలజీ మానవుడికి మేలు చేసేలా ఉండాలేతప్ప కీడుచేయకూడదని, ఇటువంటి మెసేజ్ లు పంపి ప్రజలను గురిచేయడం సరైనది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు….

Comments