ఆనందాన్ని ఎవరు కోరుకోరు! కాని లక్షకు పైనే ఖర్చు పెట్టాలి!


సొసైటీలో స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత జనం వాటి మీద మోజు పెంచుకోవడం మొదలుపెట్టారు. మార్కెట్ లోకి వచ్చే కొత్త కొత్త ఫీచర్ ఫోన్స్ మీద ఆసక్తి చూపించడం. వాటిని కొనుగోలు చేయడం చేస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ ట్రెండ్ లో టాప్ బ్రాండ్ అంటే. అది ఆపిల్ ఐఫోన్. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కడికి ఐఫోన్ వాడాలని ఉంటది. అయితే అది సామాన్యుడికి అందే ధరల్లో ఎప్పుడు దొరకదు. ఐఫోన్ బ్రాండ్ లో ఎ ఫోన్ కొనాలన్న తక్కువలో తక్కువ 50వేలు ఖర్చు పెట్టాలి. అయిన ప్రపంచంలో ఐఫోన్ సిరీస్ కి మంచి డిమాండ్ ఉంది. ఆ బ్రాండ్ మార్కెట్ లోకి వస్తుంది అంటే ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక బ్రాండ్ మార్కెట్ లో అమ్మకాలకి రెడీ అవుతుంది అంటే. ముందుగానే బుకింగ్స్ వస్తూ ఉంటాయి. మరి అలాంటి ఐఫోన్ సిరీస్ నుంచి మరో కొత్తవి వస్తున్నాయంటే ఎవరు మాత్రం ఆసక్తి చూపించకుండా ఉంటారు.

అవును ఐఫోన్ సిరీస్ నుంచి తాజాగా ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, 8ఎస్ మార్కెట్ లోకి రానున్నాయి. ఈ ఐఫోన్ ఎక్స్ అక్టోబర్ 27 నుంచి ఇండియా మార్కెట్ లోకి రానున్న నేపధ్యంలో ఇప్పటి నుంచి చాలా మంది వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ధర ప్రాతిపాదిక చూస్తే ఈ ఐఫోన్ ఎక్స్ ప్రారంభ ధర 89 వేల నుంచి ఉంది. ఇక 256జీపీ మెమొరీతో ఉండే ఐఫోన్ మొబైల్ అయితే ఏకంగా లక్ష రెండు వేలు రూపాయిలు ఉంది. మరి ఈ మొబైల్ కొనాలనే ఆసక్తి ఉంటె సరిపోదు. కొనాలంటే మాత్రం ఒక లక్ష రూపాయిలు మీవి కావు అనుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్స్ అన్నిటికంటే ఇది చాలా ప్రత్యేకం అని అంటున్నారు. మరి వీటికి ప్రజల నుంచి ఎలాంటి ఆసక్తి ఉంటుందో చూడాలి.

Comments