అదిరే ఆరంభంతో ఐఫోన్ మెరుపులు..’ఎక్స్’ పైనే అందరి లుక్స్ !

ఐఫోన్ కొత్త పండక్కి అంతా సిద్ధం అయింది. ఐఫోన్ మార్కెట్ లోకి వస్తుందంటేనే చాలా నెలల తరబడి ఎదురుచూసే వారు ఉన్నారు. టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ రూపొందించిన ఐఫోన్ ఎక్స్ లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా కాలిఫోర్నియాలో జరగనుంది. కాలిఫోర్నియాలో నూతనంగా నిర్మించిన యాపిల్ కొత్త కార్యాలయంలో ఈ ఈవెంట్ జరగనుంది. ప్రస్తుతం యాపిల్ సంస్థ దశ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యలో ప్రతిష్టాత్మకంగా మూడు ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకురానున్నారు. వాటిలో ఒకటి ఐఫోన్ ఎక్స్ కాగా మిగిలినవి ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్.

ఈ మెగా ఈవెంట్ పై ప్రపంచంలోని స్మార్ట్ ఫోన్ ప్రియులంతా దదృష్టి సారించారు. ఇప్పటి వరకు ఐఫోన్ ఎక్స్ గురించి కొన్ని లీకులు మాత్రమే వచ్చాయి. ఈ ఫోన్ ప్రత్యేకతలు తెలుసుకునేందుకు అంతా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఐఫోన్ ఎక్స్ వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ తో రాబోతోందంటూ ఇప్పటికే ఊహాగానం మొదలైపోయింది. ఐఫోన్ ఎక్స్ ధర భారత మార్కెట్ లో రూ 64 వేలు ఉంటుందని అంచనా. సెప్టెంబర్ 22 నాటికీ అంతర్జాతీయంగా అన్ని స్టోర్ లలో ఐఫోన్ ఎక్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై క్లారిటీ లేదు.

Comments