ఊరించే ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ అద్భుత ఫీచర్లు ఇవే..!

యాపిల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐఫోన్ 8 లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఐఫోన్ 8 కోసం ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 8 లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి..దీని లుక్ ఎలా ఉండబోతోంది..ధరెంత అనే విషయాలని తెలుసుకోవడానికి అంతా తీవ్ర ఉత్కంఠ తో ఎదురుచూస్తున్నారు. కాగా యాపిల్ మెగా ఈవెంట్ లో ఐఫోన్ 8 కు సంబందించిన విశేషాలని ఆ సంస్థ సీఈఓ టీమ్ కుక్, ఎక్సిక్యూటివ్ అధికారి స్కిల్లర్ వివరించారు. ఐఫోన్ 8 మరియు ఐఫోన్ 8 ప్లస్ ఫీచర్లు మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి..

* ఐఫోన్ 8 మరియు ఐఫోన్ 8 ప్లస్ మూడు కలర్స్.. సిల్వర్, స్పేస్ గ్రే మరియు గోల్డ్ లలో లభించనున్నాయి.
* డిస్ ప్లే : 4.7 ఇంచెస్ డిస్ ప్లే తో ఐఫోన్ 8, 5.5 ఇంచెస్ డిస్ ప్లే తో ఐఫోన్ 8 ప్లస్
* సరి కొత్త స్టెయిరో స్పీకర్లు
* ఐఫోన్ 8 మరియు ఐఫోన్ 8 ప్లస్ రెండింటికి వైర్ లెస్ ఛార్జింగ్ సదుపాయం
* ఐఫోన్ 8.. 32 జిబి, 256జిబి మరియు 512 జిబి లలో లభించనుంది.
* 12 ఎంపీ కెమెరా, 1080 హెచ్ డి
* ధర : ఐఫోన్ 8- 699 డాలర్లు (రూ 44746), ఐఫోన్ 8 ప్లస్ – 799 డాలర్లు(రూ 51147)

ఐఫోన్ ఎక్స్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..

యాపిల్ సంస్థ ఎక్సిక్యూటివ్ అధికారి స్కిల్లర్ మాట్లాడుతూ ఈ దశాబ్దపు అద్భుత ఫాంగా ఐఫోన్ ఎక్స్ ని అభివర్ణించడం విశేషం. టెక్నాలజీని ఈ ఫోన్ సరికొత్త పుంతలు తొక్కిస్తోందని ఆయన అభిప్రాయంపడ్డారు.

* ఐఫోన్ ఎక్స్ స్టైన్ లెస్ స్టీల్ తో తయారు చేయబడింది.
* సిల్వర్, గ్రే కలర్స్ లో లభించనుంది.
* అద్భుతమైన డిస్ ప్లే : 5.8 ఇంచెస్ తో సూపర్ రెటీనా డిస్ ప్లే,2436 * 1125, 458పీపీఐ రిజల్యూషన్
*ఇందులో హోమ్ బటన్ లేదు. జస్ట్ స్క్రీన్ ని టాప్ చేస్తే సరిపోతుంది.
* పేస్ రికగ్నైజేషన్ ఫీచర్ ఇందులో ఉంది.
* వైర్ లెస్ ఛార్జింగ్ సదుపాయం
* ఐఫోన్ ఎక్స్ 64 జిబి, 256 జిబి వేరియంట్లలో లభించనుంది.
* ధర : 999 డాలర్లు (రూ 64,000)

ఐఫోన్ 8 మరియు 8 ప్లస్ లు ఈ నెలలోనే మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నట్లు యాపిల్ ప్రకటించింది. కాగా ఐఫోన్ ఎక్స్ మాత్రం అక్టోబర్ 27 నుంచి ఆర్డర్లని ఓపెన్ చేయనున్నారు.

Comments