ఆ దేశంలో ఐఫోన్ ధర రూ.66 లక్షలు..కోటీశ్వరులకు కూడా కష్టమే..!

iphone
ఎప్పటికైనా ఐఫోన్ కొనాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అధునాతన ఫీచర్లతో ఐఫోన్ అందరిని ఊరిస్తుంది. అమెరికాలోని ప్రముఖ ఈ – కామర్స్ సంస్థ లియోని పలు దేశాలలోని ఐఫోన్ ధరలపై సర్వే నిర్వహించింది. ఆయా దేశాలలోని ఆన్లైన్ రిటైల్ సంస్థలు పెట్టిన ధరల ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేసింది.తక్కువ ధర కలిగిన మోడల్ నుంచి ఖరీదైన మోడల్ ఫోన్ ల సగటు ధరల ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది. ప్రపంచం లో ఐఫోన్ లు చీప్ గా లభించే దేశం, అత్యంత ఎక్కువ ధరకు లభించే దేశాలను పేర్కొంది.

ప్రపంచంలోనే ఐఫోన్ లు అత్యంత చౌకగా లభించే దేశం ఆఫ్రికా లోని అంగోలా. ఈ దేశంలో ఐఫోన్ చాలా చౌకగా లభిస్తుంది.అంగోలాలో ఐఫోన్ సగటు ధర 401.4 డాలర్లు (రూ 27, 290), అదే ఇండియా లో అయితే ఐఫోన్ సగటు ధర 505.25 డాలర్లు(రూ.34,350), అమెరికాలో 625.88 డాలర్లు(రూ.43,230)గా ఉంది.ప్రపంచంలో అంగోలా దేశంలో ఐఫోన్ అత్యంత చౌకగా లభిస్తుంటే వెనిజులాలో మాత్రం ఐఫోన్ కొనాలంటే మినిమన్ కుబేరుడై ఉండాలి.అక్కడ ఐఫోన్ ధర భారీ స్థాయిలో ఉంటుంది. కోటీశ్వరులు సైతం ఐఫోన్ ని కొనాలంటే ఆలోచించాల్సిందే. వెనిజులాలో ఐఫోన్ సగటు ధర 97,813.82 డాలర్లు( సుమారు రూ.66 లక్షలు). ఇప్పటికే ఆ దేశం ఆర్ధిక మాంద్యంతో విలవిలలాడుతోంది. ఆయా దేశాల్లో పన్నులు, ద్రవ్యోల్బణం మీద ఈధరలు ఆధారపడి ఉంటాయని లియోని సంస్థ తెలిపింది. అంగోలాలో పన్నులు తక్కువగా ఉండడం వల్ల ఐఫోన్ లు చౌకగా లభిస్తాయని, అదే వెనిజులాలో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉండడం, పన్నులు అధికంగా ఉండడం వల్ల అధికస్థాయి ధరలలో మాత్రమే ఐఫోన్ లభిస్తుందని తెలిపింది.

Comments