ప్రచురణ తేదీ : Jan 29, 2018 3:08 PM IST

ఇంటర్నేషనల్ లెవల్ లో జనసేన బ్రాండింగ్..!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మూడు రోజుల అనంతపురం జిల్లా పర్యటన కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ నేడు జిల్లాలోని ధర్మవరంలో పర్యటించారు. తొలి రెండు రోజులు మహిళలు రైతులతో మమేకమైన జనసేనాని మూడవ రోజు చేనేత కార్మికులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి కష్టనష్టాలని అడిగి తెలుసుకున్నారు. ధర్మవరం చేనేత వస్తాలకు ప్రసిద్ధి గాంచిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ధర్మవరం చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రపంచం దృష్టికి తీసుకునివెళతానని అన్నారు. అభిమానులు పట్టు వస్త్రాన్ని బహుకరించగా పవన్ వారిని అభినందించారు. చేనేత కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని అభ్యర్థించారు. చేనేత అనేది ఓ కళ అని దానిని అంతరించిపోకుండా కాపాడుకోవలసిన భాద్యత మనపై ఉందని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తనని తాను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.

Comments