ఉండవల్లి – జేపీ..ఆలోచనలు ఒకటవుతాయా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని అధికార పార్టీ సహా అన్ని పార్టీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ విషయమై తనదైన రీతిలో ముందుకు వెళుతున్నారు జానస్న అధినేత పవన్ కళ్యాణ్. ఈ అంశం కోసం ఉండవల్లి, జేపీ వంటి ప్రముఖులతో ఒక జేఏసీ ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇప్పటికే నాలుగు రోజుల క్రితం లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ను, ఆదివారం నాడు కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఇక పవన్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై జయప్రకాశ్ తో చర్చించాలని ఉండవల్లి నిర్ణయించారు. పవన్ తో భేటీ అనంతరం జయప్రకాశ్ మాట్లాడుతూ, పవన్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉండవల్లి, జయప్రకాశ్ కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. పవన్ తనతో మాట్లాడిన అంశాలను జేపీ దృష్టికి తీసుకు వెళ్లనున్న ఉండవల్లి, ఆయనతో మాట్లాడిన తరువాతనే జేఏసీలో చేరేది, లేనిది అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారని, కాబట్టి వారిద్దరి కలయిక ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పవన్ కేంద్రం నిధులువిషయమై తాము అన్ని రాష్ట్రాలకంటే ఏపీ కె ఎక్కువ సాయం చేస్తున్నామని అంటే, టిడిపి వాదన మరోలా ఉందని, టిడిపి వారేమో కేంద్ర సాయం ఇంకా అందాల్సి ఉందని, ఇప్పటివరకు వచ్చిన నిధులు చాలా తక్కువని అంటున్నారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇద్దరి లో ఎవరో ఒకరు అబద్దం ఆడుతున్నట్లు తెలుస్తోందని, ఈ విషయమై కేంద్రంవారు విడుదల చేసిన నివేదికను, అలానే టిడిపి ప్రభుత్వానికి అందిన నిధుల నివేదికను ఈ నెల 15 లోగ ఇస్తే జేఏసీ నాయకులతో చర్చించి లోటు పాట్లు ఉంటే సరిచేసుకోవచ్చని అన్న విషయం విదితమే…..

Comments